జానీ మాస్టర్ ను గోవా కోర్టులో హాజరుపర్చనున్న పోలీసులు

55చూసినవారు
జానీ మాస్టర్ ను గోవా కోర్టులో హాజరుపర్చనున్న పోలీసులు
కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ ను హైదరాబాద్ పోలీసులు గోవాలో అదుపులోకి తీసుకున్నారు. ఐదు రోజులుగా పోలీసులకు దొరక్కుండాపోయిన జానీని ఇవాళ గోవాలో అరెస్ట్ చేశారు. మరికాసేపట్లో గోవా కోర్టులో పోలీసులు హాజరు పర్చనున్నారు. రేపు హైదరాబాద్ ఉప్పరపల్లి కోర్టులో ప్రవేశపెట్టనున్నారు. కాగా, జానీ మాస్టర్‌ తనపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడంటూ ఆయన మహిళా అసిస్టెంట్‌ ఇటీవల పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో నార్సింగిలో కేసు నమోదైంది.

సంబంధిత పోస్ట్