VIDEO: కేబీబీవీలో అమానుషం.. విద్యార్థినుల జుట్టు కత్తిరించిన హాస్టల్ ఇంచార్జ్
AP: విశాఖపట్నం జిల్లా జి.మాడుగల మండల కేంద్రంలోని కేజీబీవీలో అమానుషం చోటుచేసుకుంది. పాఠశాలకు ఆలస్యంగా వచ్చారని హాస్టల్ ఇంచార్జ్ ప్రసన్న కుమారి ఏకంగా 15 మంది విద్యార్థినుల జట్టు కత్తిరించింది. పాఠశాలకు ఆలస్యంగా వచ్చినంత మాత్రాన జట్టు కత్తిరించడం ఏంటని విద్యార్థినుల తల్లిదండ్రులు మండిపడుతున్నారు. ఈ దారుణానికి ఒడిగట్టిన ఇంచార్జ్ ప్రసన్న కుమారిని విధుల నుంచి వెంటనే తప్పించాలంటూ వారు డిమాండ్ చేస్తున్నారు.