అర్హులు అందరికి రుణమాఫీ చేయాలి : ఎమ్మెల్యే

54చూసినవారు
కొందరికే కాదు, అందరికి రుణమాఫీ చేయాలి అని సిర్పూర్ ఎమ్మెల్యే డా. పాల్వాయి హరీష్ బాబు డిమాండ్ చేశారు. గురువారం బెజ్జూర్ మండల కేంద్రంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఎదుట బీజేపి ఆధ్వర్యంలో రైతులతో కలిసి ధర్నాను నిర్వహించడం జరిగింది. ఈ ధర్నాకు హాజరైన ఎమ్మెల్యే మాట్లాడుతూ. కేవలం కొందరికి మాత్రమే రుణమాఫీ చేసి ప్రభుత్వం చేతుల దులుపుకుంటుందని, అందరికీ రూ. 2 లక్షల రుణమాఫీ వర్తింపజేయాలని డిమాండ్ చేశారు.
Job Suitcase

Jobs near you