తైవాన్ చుట్టూ నౌకలు, యుద్ధ విమానాలను మోహరించిన చైనా
చైనా మరోసారి కవ్వింపు చర్యలకు దిగింది. తైవాన్ సమీపంలో సోమవారం సైనిక విన్యాసాలు ప్రారంభించింది. భారీగా విమానాలు, ఓడలను ద్వీప దేశం చుట్టు పక్కల మోహరించింది. తైవాన్‌కు ఉత్తర, దక్షిణ, తూర్పు ప్రాంతాల్లో ‘జాయింట్ స్వోర్డ్-2024బీ’ పేరుతో కసరత్తులు చేపట్టినట్టు చైనీస్ మిలిటరీ ఈస్టర్న్ థియేటర్ కమాండ్ తెలిపింది. ఇది తైవాన్ స్వాతంత్ర్య దళాల వేర్పాటువాద చర్యలకు ఒక హెచ్చరిక అని పేర్కొంది.