అదుపు తప్పి ఆటో బోల్తా.. ఇద్దరు వ్యక్తులకు గాయాలు
జూలూరుపాడు మండలం దండుమిట్టతండా గ్రామం వద్ద ఆటో బోల్తా పడింది. కొత్తగూడెం వైపు వెళుతున్న లారీని అదే రూట్లో వెళ్తున్న ఆటో స్పీడుగా లారీని ఓవర్ టేక్ చెయ్యబోయి అదుపు తప్పి రోడ్డు పక్కనే ఉన్న లోయలోకి దూసుకుపోయి ఆటో బోల్తా పడిన సంఘటన చోటుచేసుకుంది. ఆటోలో ప్రయాణిస్తున్న ఒక వ్యక్తికి తీవ్ర గాయాలు కాగా, మరో వ్యక్తికి స్వల్ప గాయాలు అయ్యాయి. స్థానికులు వారిని 108 ద్వారా ఆసుపత్రికి తరలించారు.