విశాఖలో మోదీ పర్యటన.. భారీ బందోబస్తు
AP: ప్రధాని మోదీ ఇవాళ విశాఖలో పర్యటించనున్నారు. రూ.2.08 లక్షల కోట్ల విలువైన ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్నారు. సిరిపురం జంక్షన్ నుంచి ఏయూ గ్రౌండ్స్ వరకు సుమారు కిలో మీటర్ ర్యాలీ ఉంటుంది. ప్రధాని వెంట సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కూడా ఉంటారు. దాంతో పోలీసులు కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేశారు. ఏయూ పరిసరాలను ఎల్పీజీ తమ ఆధీనంలో తీసుకుంది. 5 వేల మంది పోలీసులు భద్రతను పర్యవేక్షించనున్నారు.