హీరో విశాల్ ఆరోగ్యంపై వస్తున్న వార్తల నేపథ్యంలో నటి కుష్బూ క్లారిటీ ఇచ్చారు. ‘11 ఏళ్ల తర్వాత తన ‘మదగజరాజు' మూవీ రిలీజ్ అవుతుందని.. డెంగ్యూతో బాధపడుతున్నా విశాల్ ఈవెంట్‌కు వచ్చారు. 103 డిగ్రీల టెంపరేచర్ కారణంగా వణికారు. ఈవెంట్ తర్వాత ఆస్పత్రికి తీసుకెళ్లగా కోలుకుంటున్నారు. కంగారు పడాల్సిన అవసరం లేదు. వ్యూస్ కోసం విశాల్ ఆరోగ్యంపై కొందరు తప్పుడు వార్తలు రాస్తున్నారు' అని కుష్బూ అసహనం వ్యక్తం చేశారు.