‘గేమ్ ఛేంజర్’ ఈవెంట్‌కు వెళ్లి వస్తుండగా ఘోర ప్రమాదం
AP: ‘గేమ్ ఛేంజర్’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు వచ్చి తిరిగి ఇంటికి వెళ్తుండగా ఘోర ప్రమాదం జరిగింది. ఇద్దరు యువకులు మృతి చెందారు. ఈ ఘటన రాజమండ్రి సమీపంలో జరిగింది. కాకినాడకు చెందిన అరవపల్లి మణికంఠ, తోకాడ చరణ్ శనివారం గేమ్ ఛేంజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు వచ్చారు. ఈవెంట్ ముగిసిన అనంతరం కాకినాడ వైపు బైక్‌పై వెళ్తుండగా కార్గిల్ ఫ్యాక్టరీ వద్ద వ్యాను ఢీకొట్టింది. మణికంఠ అక్కడికక్కడే చనిపోగా.. చరణ్‌ను ఆస్పత్రికి తరలిస్తుండగా మృతి చెందాడు.