రూ.596 పెట్టి పిజ్జా కొన్న ఓ వ్యక్తికి భయానక అనుభవం ఎదురైంది. పూణెకు చెందిన అరుణ్ పిజ్జా తింటుండగా.. నోట్లో ఏదో గుచ్చుకున్నట్లుగా అనిపించింది. వెంటనే బయటకు తీసి చూస్తే.. అది విరిగిన కత్తి ముక్క. అవాక్కయిన అతడు పిజ్జా ఆర్డర్ చేసిన అవుట్‌లెట్‌కు ఫోను చేసి విషయం చెప్పాడు. మొదట ఆయన మాటను తోసిపుచ్చిన షాపు మేనేజరు ఆ తర్వాత వినియోగదారుడి ఇంటికి వచ్చి పరిశీలించాడు. ఆధారాలతో సహా చూపడంతో తప్పును అంగీకరించి క్షమాపణలు కోరాడు.