పరవాడ ఫార్మాసిటీలో భారీ అగ్ని ప్రమాదం
AP: అనకాపల్లిలోని పరవాడ ఫార్మాసిటీలో మంగళవారం తెల్లవారుజామున భారీ అగ్ని ప్రమాదం జరిగింది. మెట్రో కెం ఫార్మా కంపెనీలో మంటలు భారీగా ఎగిసిపడుతున్నాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని మంటలను ఆర్పేందుకు ప్రయత్నిస్తున్నారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.