RCB జట్టుకు IPL ట్రోఫీ గెలుపొందడం అందని ద్రాక్షగానే మిగిలింది. ఈ జట్టుకు భారీగా అభిమానులు ఉండగా వారి కల ఒక్కసారి కూడా నెరవేరలేదు. ప్రతి ఐపీఎల్ టోర్నీలో 'ఈ సాలా కప్ మనదే' అంటూ స్టేడియంలో సందడి చేస్తుంటారు. కానీ దురదృష్టం ఆ జట్టును వెంటాడుతుండటంతో గెలుపు దరిచేరలేదు. ఈక్రమంలో 144 ఏళ్లకు ఒకసారి వచ్చే 'మహా కుంభమేళా'లో ఆ జట్టు జెర్సీని త్రివేణి సంగమంలో ఓ అభిమాని ముంచి, పూజలు చేశారు. ఈ వీడియో వైరల్ అవుతోంది.