దేవరకద్ర నియోజకవర్గ కేంద్రంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎమ్మెల్యే జి. మధుసూదన్ రెడ్డి చిత్రపటాలకు బుధవారం కాంగ్రెస్ నాయకులు పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. బీసీ రిజర్వేషన్, ఎస్సీ వర్గీకరణ బిల్లు వంటి విప్లవాత్మకమైన నిర్ణయాలు తీసుకువచ్చి, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ యువకుల స్వయం ఉపాధి అవకాశాలు మెరుగుపరిచేందుకు రాజీవ్ యువ వికాసం పథకం తీసుకొచ్చిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వందేనని అన్నారు.