దేవరకద్ర: కార్యకర్తలకు నాయకులు భరోసా ఇవ్వాలి: మాజీ ఎమ్మెల్యే

57చూసినవారు
మహబూబ్ నగర్ జిల్లా కౌకుంట్ల మండల కేంద్రంలో బుధవారం బిఆర్ఎస్ పార్టీ ముఖ్య నాయకుల సమావేశం మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్బంగా ఆల వెంకటేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ. బిఆర్ఎస్ కార్యకర్తలకు మండల స్థాయి నాయకులు ఏ ఆపదలో నైనా తామున్నామన్న భరోసా ఇవ్వాలని అన్నారు. హామీలు అమలు చేయకుండా ప్రజలను మోసం చేసిన కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని శ్రేణులకు సూచించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్