చంద్రబాబుకు తలనొప్పిగా మారిన నేతలు?
AP: కూటమి పార్టీల మధ్య సఖ్యత లోపించినట్లు కనిపిస్తోంది. దాదాపు 20 నియోజకవర్గాలలో కూటమి పార్టీల నేతలు ఎవరి రాజకీయాలు వారే చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. పార్టీ ఆదేశాలను బేఖాతరు చేస్తున్నారట. ఈ వ్యవహారం సీఎం చంద్రబాబుకు తలనొప్పిగా మారిందని రాజకీయ వర్గాలు చెబుతున్నాయి. కూటమి నేతలను కంట్రోల్ చేయడం పెద్ద టాస్క్‌గా మారిందట. ఇది ఇలాగే కొనసాగితే కూటమి ప్రభుత్వంలో చీలికలు ఏర్పడే అవకాశముందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.