బైకులో దూరిన పాము (షాకింగ్ వీడియో)
TG: సూర్యాపేట జిల్లా హుజూర్‌నగర్‌లో మంగళవారం షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. సూపర్ మార్కెట్ వద్ద ఓ పాము హల్చల్ చేసింది. మార్కెట్‌కి సరుకుల నిమిత్తం వచ్చిన వ్యక్తి బైక్ లో పాము దూరింది. దానిని గమనించిన బైకర్ ఒక్కసారిగా షాకయ్యాడు. దీంతో స్థానికులు పాము కోసం చాలా సేపు వెతకగా చివరికి బైకు నుంచి కిందకు దూకింది. వెంటనే దానిని కర్రలతో కొట్టి చంపేశారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.