ఖరీఫ్ సీజన్‌లో ఏపీలోని 5 జిల్లాల్లోని 54 మండలాలను ప్రభుత్వం కరువు మండలాలుగా ప్రకటించింది. వీటిలో 27 తీవ్ర కరువు, మరో 27 మండలాలను మధ్యస్థ కరువు ప్రాంతాలుగా గుర్తించింది. అత్యధికంగా అన్నమయ్య జిల్లాలో 19, చిత్తూరు 16, శ్రీసత్యసాయి 10, అనంతపురం 7, కర్నూలు జిల్లాలో 2 మండలాల్లో కరువు పరిస్థితులు ఏర్పడినట్లు పేర్కొంది. వర్షాధారమైన ఉత్తరాంధ్ర జిల్లాల్లో ఒక్క మండలం పేరు కూడా లేకపోవడం విశేషం.