సీఎం క్యాంపు కార్యాలయాన్ని ముట్టడిస్తాం: వాలంటీర్లు
AP: ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు తమను విధుల్లో కొనసాగించడంతో పాటు రూ.10 వేలకు జీతం పెంచాలని వాలంటీర్లు డిమాండ్ చేస్తున్నారు. ఇచ్చిన హామీలను నెరవేర్చకపోతే అమరావతిలోని సీఎం క్యాంపు కార్యాలయాన్ని ముట్టడిస్తామని సీపీఐ అనుబంధ ఏఐవైఎఫ్ హెచ్చరించింది. ప్రభుత్వ వ్యవస్థలో వాలంటీర్లు లేరని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చెప్పడం సరికాదని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ అన్నారు. వాలంటీర్ల విషయంపై త్వరలో సీఎం చంద్రబాబును కలవనున్నట్లు తెలిపారు.