AP: నైరుతి బంగాళాఖాతంలో సోమవారం అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఇది రెండు రోజుల్లో తమిళనాడు/శ్రీలంక తీరాల వైపు కదులుతుందని పేర్కొంది. దీని ప్రభావంతో రేపటి నుంచి 13వ తేదీ వరకు ఏపీలోని రాయలసీమ, దక్షిణ కోస్తా జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. మత్స్యకారులు సముద్రంలో వేటకు వెళ్లొద్దని హెచ్చరించింది.