మంత్రి కొండా సురేఖకు నాంపల్లి కోర్టు సమన్లు
తెలంగాణ మంత్రి కొండా సురేఖకు నాంపల్లి కోర్టు సమన్లు జారీ చేసింది. డిసెంబర్ 12న వ్యక్తిగతంగా హాజరుకావాలని ఆదేశించింది. మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యలపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని నాగార్జున వేసిన పిటిషన్ ను కోర్టు పరిగణనలోకి తీసుకుంది. కాగా, నాగార్జున, కేటీఆర్, నాగచైతన్య, సమంతపై మంత్రి సురేఖ సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే.