రాజస్థాన్లో ఘోర రోడ్డు ప్రమాదం.. 8 మంది మృతి
రాజస్థాన్లో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. సిరోహ్ జిల్లాలోని పింద్వారా ప్రాంతంలో ఆదివారం రాత్రి ఓ ట్రక్కును ఎదురుగా వచ్చిన జీపు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 8 మంది మృతిచెందగా.. 18 మందికి గాయాలయ్యాయి. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు చికిత్స నిమిత్తం క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.