Top 10 viral news 🔥

ఆర్థిక సంస్కరణలకు ఆద్యుడు మన్మోహన్ సింగ్
ఆర్థిక సంస్కరణలకు ఆద్యుడు.. మన్మోహన్ సింగ్. 2004 నుంచి 2014 వరకు ప్రధానిగా ఆర్థిక సంస్కరణలకు ఆయన పెద్దపీట వేశారు. నెహ్రూ, ఇందిరా, మోదీ తర్వాత అత్యధిక కాలం దేశ ప్రధానిగా మన్మోహన్ కొనసాగారు. 33 ఏళ్ల పాటు పార్లమెంటు సభ్యుడిగా ఉన్నారు. 1991లో రాజ్యసభలో అడుగుపెట్టారు. పీవీ నరసింహారావు హయాంలో ఆర్థిక మంత్రిగా పనిచేశారు. ఆర్థిక శాఖలో సలహాదారుగా, కార్యదర్శిగా, ఆర్బీఐ గవర్నర్గా కూడా మన్మోహన్ పని చేశారు.