ప్రముఖ మలయాళ రచయిత, డైరెక్టర్ వాసుదేవన్ కన్నుమూత
ప్రముఖ మలయాళ రచయిత, డైరెక్టర్ ఎంటీ వాసుదేవన్ నాయర్(91) ఇక లేరు. వారం రోజుల క్రితం కోజికోడ్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేరిన ఆయన గుండె ఆగిపోవడంతో బుధవారం తుదిశ్వాస విడిచారు. ఆయన మృతిపై కేరళ సీఎం విజయన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. 1995లో నాయర్‌కు జ్ఞానపీఠ్ అవార్డు లభించింది. 9 నవలలు, 19 కథా సంకలనాలను ఆయన రచించారు. ఏడు సినిమాలకు దర్శకత్వం వహించారు. 54 స్క్రీన్ ప్లేలు రాసారు. ఆయన 4 సినిమాలకు నేషనల్ అవార్డులు వచ్చాయి.