సీఎం చంద్రబాబుపై అంబటి ఫైర్ (వీడియో)
AP: సీఎం చంద్రబాబుపై వైసీపీ మాజీ మంత్రి అంబటి రాంబాబు మండిపడ్డారు. ‘కూటమి ప్రభుత్వం అన్నింటిని ప్రైవేటుకు కట్టబెడుతోంది. జలహారతిని తీసుకొచ్చారు. అది చంద్రబాబుకు సంబంధించిన వ్యక్తులకు హారతి. చంద్రబాబు ఏనాడు ప్రాజెక్టుల గురించి పట్టించుకోలేదు. కొత్తగా గోదావరి-బనకచర్లని కూడా తనదే అంటూ ప్రచారం చేస్తున్నారు. అది జగన్ హయాంలో ప్రారంభించిన ప్రాజెక్ట్. చివరికి ఈ ప్రాజెక్టు కూడా ప్రైవేటుపరం చేయబోతున్నారు.’ అని అంబటి వ్యాఖ్యానించారు.