తెలుగు రాష్ట్రాలను చలి వణికిస్తోంది. తెలంగాణలో రాబోయే 5 రోజులపాటు కనిష్ఠ ఉష్ణోగ్రతలు మరింత తగ్గుతాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఉదయం వేళల్లో పొగమంచు ఏర్పడే అవకాశం ఉందంది. కాగా ఇవాళ పటాన్‌చెరులో అత్యల్పంగా 13.2 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఇక ఏపీలోని అరకు, మినుములూరులో 12, పాడేరులో 14, చింతపల్లిలో 16.9 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది.