బెనెగల్ మృతిపై స్పందించిన చిరంజీవి
ప్రముఖ దర్శకుడు శ్యామ్ బెనెగల్ మృతిపై నటుడు చిరంజీవి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. దేశంలోని అత్యుత్తమ దర్శకులు, గొప్ప మేధావుల్లో బెనెగల్ ఒకరంటూ ట్వీట్ చేశారు. చలనచిత్ర రంగంలో వెలుగొందిన కొంతమంది ప్రముఖుల్లో ప్రతిభను గుర్తించి ప్రోత్సహించారని తెలిపారు. ఆయన సినిమాలు, జీవిత చరిత్రలు, డాక్యుమెంటరీలు భారత గొప్ప సాంస్కృతిక సంపదలో భాగమని చెప్పారు. తోటి హైదరాబాదీ, మాజీ రాజ్యసభ సభ్యుడైన బెనెగల్ అద్భుతమైన సినిమాలు తీశారని కొనియాడారు.