Top 10 viral news 🔥
ఢిల్లీలో అన్ని స్కూల్స్ మూసివేత
ఢిల్లీలో వాయు కాలుష్యం డేంజర్ బెల్స్ దాటిపోయింది. ఢిల్లీ ఎన్సీఆర్ పరిధిలో గ్రేడేడ్ రెస్పాన్స్ యాక్షన్స్ ప్లాన్ -4 కింద ప్రభుత్వం మరిన్ని నిబంధనలు విధించింది. ఇవన్నీ సోమవారం ఉదయం 8 గంటల నుంచి అమలులోకి రానున్నాయి. తదుపరి ఆదేశాలు వచ్చే వరకు అన్ని పాఠశాలలను మూసీ వేసింది. అన్ని తరగతులకు కేవలం ఆన్లైన్ తరగతులే నిర్వహించాలని ప్రకటించింది. నిత్యావసర వస్తువులు మినహా అన్నిరకాల ట్రక్కులను నిలిపి వేయనున్నారు.