అంత్యక్రియల తర్వాత నిర్వహించే సంస్మరణ సభలో చనిపోయిన వ్యక్తి పాల్గొన్నాడు. ఈ ఘటన గుజరాత్‌లోని మెహసానా జిల్లాలో చోటు చేసుకుంది. బ్రిజేష్ సుతార్ అనే వ్యక్తి అక్టోబర్ 27న అదృశ్యం అయ్యాడు. ఫిర్యాదు అందుకున్న పోలీసులకు ఈ నెల 10న సబర్మతి వంతెన సమీపంలో కుళ్లిన స్థితిలో ఓ మృతదేహం లభ్యమైంది. చనిపోయింది సుతార్ అనికొని డెడ్‌బాడీని కుటుంబానికి అప్పగించారు. వారు అంత్యక్రియలు పూర్తి చేసి, 15న సంస్మరణ సభ నిర్వహించారు. ఆ సభలో సుతార్ పాల్గొనడంతో బంధువులు ఆశ్చర్యపోయారు.