కుంభమేళాకు ఉగ్రముప్పు
ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగరాజ్‌లో జరిగే కుంభమేళాకు ఉగ్రముప్పు పొంచి ఉంది. ఈ మేరకు నిఘా వర్గాలు ఆ రాష్ట్ర ప్రభుత్వానికి హెచ్చరికలు జారీ చేశాయి. ఉగ్రమూకలు సాధువుల రూపంలో దాడులకు తెగబడే ప్రమాదం ఉందని హెచ్చరించడంతో యూపీ పోలీసులు అప్రమత్తమయ్యారు. ఈ ఉత్సవానికి ప్రపంచ వ్యాప్తంగా 40 కోట్ల మంది వస్తారని అంచనా. ఈ నేపథ్యంలో పోలీసులు ఎక్కడికక్కడ కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేసి, భక్తుల్ని నిశితంగా పరిశీలిస్తున్నారు.