TG: నిజామాబాద్ జిల్లాలో విషాద ఘటన చోటుచేసుకుంది. నవీపేట్ శివారులో ద్విచక్ర వాహనాన్ని లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఫకీరాబాద్‌కు చెందిన మగ్గిడి లక్ష్మణ్, రాజమణి దంపతులు మృతిచెందారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాలను ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.