ఫ్రెండ్స్ ఛాలెంజ్.. టపాసులపై కూర్చొని చనిపోయాడు (వీడియో)
కర్ణాటకలో దారుణ ఘటన చోటుచేసుకుంది. బెంగళూరులోని కోననకుంటె కాలనీకి చెందిన 32 ఏళ్ల శబరీష్కు తన స్నేహితులు.. టపాసులను అంటించి దానిపై స్టీల్ బాక్స్ పెట్టి కూర్చోవాలని, అలా చేస్తే ఆటో రిక్షా కొనిస్తామని సవాల్ విసిరారు. దీంతో మద్యం మత్తులో ఉన్న శబరీష్ అలాగే చేయడంతో తీవ్రంగా గాయపడ్డాడు. స్థానికులు అతడిని హుటాహుటిన ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ నవంబర్ 2న మరణించాడు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఆరుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు.