ఎమ్మెల్యే చిట్టెం పర్ణిక రెడ్డి రేపు నారాయణపేట పట్టణంలో వివిధ కార్యక్రమాల్లో పాల్గొంటారని బుధవారం పట్టణ అధ్యక్షుడు సలీం తెలిపారు. గురువారం ఉదయం 8:30 గంటలకు కేజీబీవీ పాఠశాలలో విద్యార్థులకు కంటి అద్దాలు పంపిణీ చేస్తారు. అనంతరం క్యాంపు కార్యాలయంలో వ్యవసాయ, ఆర్డబ్ల్యూఎస్ అధికారులతో సమీక్ష సమావేశంలో పాల్గొంటారు. 10:30 గంటలకు సిఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు అందిస్తారు. మండలాల పార్టీ అధ్యక్షులతో సమావేశం నిర్వహిస్తారు.