టెట్ అభ్యర్థులకు అలర్ట్
ఏపీలో టెట్ పరీక్షలు సమీపిస్తున్నాయి. ఈ సారి రాష్ట్రవ్యాప్తంగా టెట్ పరీక్షలకు మొత్తం 4,27,300 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. అక్టోబర్ 3 నుంచి 20వ తేదీ వరకు పరీక్షలు జరగనున్నాయి. ఆన్లైన్లో కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ (సీబీటీ)గా నిర్వహిస్తారు. సెప్టెంబర్ 22 నుంచి హాల్ టికెట్లు అందుబాటులోకి రానున్నాయి. పరీక్ష ముగిసిన ఒక రోజు తర్వాత ప్రాథమిక ‘కీ’లు విడుదల చేస్తారు.