పంజాబ్‌లో బస్సు ప్రమాదం.. రాష్ట్రపతి దిగ్భ్రాంతి
పంజాబ్‌లోని బఠిండా జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంపై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు రాష్ట్రపతి ప్రగాఢ సానుభూతి తెలిపారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. బ్రిడ్జ్ రెయిలింగ్‌ను ఢీకొని బస్సు కాల్వలోకి దూసుకుపోవడంతో 8 మంది మృతిచెందగా .. 20 మందికి గాయాలు అయిన విషయం తెలిసిందే.