ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పర్యాటక కేంద్రంగా అరకును అభివృద్ధి చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈ క్రమంలో 2025 జనవరి 31 నుంచి మూడు రోజుల పాటు అరకు ఉత్సవ్ నిర్వహించాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా ఈవెంట్స్, సాంస్కృతిక కార్యక్రమాలు, క్రీడలు నిర్వహించనుంది. రంగోలి పోటీలు, హాట్ ఎయిర్ బెలూన్‌లు వంటివి ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయి. 2014లోనూ ఏపీ సర్కారు అరకు ఉత్సవ్‌ను నిర్వహించింది.