వనపర్తి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణిలో కలెక్టర్ ఆదర్శ్ సురభి ప్రజల నుంచి అర్జీలు, వినతులు స్వీకరించారు. కలెక్టర్ మాట్లాడుతూ ప్రజా సమస్యలకు పరిష్కారం చూపే బాధ్యత అధికారులపై ఉందన్నారు. ప్రజావాణిలో వచ్చిన ఫిర్యాదులను పరిశీలించి, సత్వర పరిష్కారం చూపేలా సంబంధిత శాఖల అధికారులు చర్యలు చేపట్టాలని ఆదేశించారు. అదనపు కలెక్టర్లు యాదయ్య, జి వెంకటేశ్వర్లు, ఆర్డీఓ సుబ్రహ్మణ్యం పాల్గొన్నారు.