మంచు బీభత్సం.. కళ్లముందే జారి లోయలో పడ్డ ట్రక్కు (వీడియో)
హిమాచల్ ప్రదేశ్‌ను మంచు దుప్పటి కప్పేసింది. మనాలిలో అయితే భారీగా మంచు కురుస్తుండటంతో ఉష్ణోగ్రత మైనస్‌లోకి పడిపోయింది. భారీ హిమపాతంలో డ్రైవింగ్ ప్రమాదకరంగా మారింది. ఈ క్రమంలో ఓ వాహనం మంచుకు జారీ లోయలో పడిపోయింది. అయితే డ్రైవర్ చాకచక్యంగా తప్పించుకున్నాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.