శ్రీహరికోటలోని సతీశ్ ధవన్ స్పేస్ సెంటర్ నుంచి పీఎస్‌ఎల్‌వీ-సీ60ని విజయవంతంగా ప్రయోగించారు. పీఎస్‌ఎల్‌వీ-సీ60 ద్వారా ప్రధానంగా స్పేడెక్స్ ఉపగ్రహాలను కక్ష్యలోకి ప్రవేశపెట్టనున్నారు. స్పేడెక్స్ ప్రయోగం ద్వారా ఛేజర్, టార్గెట్ ఉపగ్రహాలను పీఎస్‌ఎల్వీ సీ-60 ప్రవేశపెట్టనుంది. ఈ రెండు ఉపగ్రహాల బరువు 440 కిలోలు ఉంటుంది. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో మొదటి లాంచ్ ప్యాడ్ నుంచి ఈ రాత్రి 10.15 సెకన్లకు ప్రయోగం చేపట్టారు.