ఘోర అగ్నిప్రమాదం.. కుటుంబం సజీవదహనం (వీడియో)
మధ్యప్రదేశ్లోని దేవాస్ జిల్లా నయాపురా ప్రాంతంలోని మిల్క్ పార్లర్ కమ్ హౌస్లో శనివారం తెల్లవారుజామున ఘోర అగ్నిప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో నలుగురు సజీవదహనం అయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు, ఫైర్ సిబ్బంది ఘటనా స్థలానికి చేసుకుని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. ఈ ఘటనలో భార్యాభర్తలు, ఇద్దరు పిల్లలు కాలిన గాయాలతో ఊపిరాడక చనిపోయినట్లు పోలీసులు తెలిపారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.