AP: ఇక నుంచి గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగులకు బయోమెట్రిక్ హాజరు ఆధారంగా వేతనాలు ఇవ్వనున్నారు. ఈ మేరకు డీడీవోలకు గ్రామ, వార్డు సచివాలయ శాఖ తాజాగా ఆదేశాలిచ్చింది. మొబైల్ యాప్‌లో ఉద్యోగులు నమోదు చేసిన హాజరునే పరిగణనలోకి తీసుకోవాలని స్పష్టం చేసింది. పాత పంచాయతీ కార్యదర్శులు, పాత వీఆర్వోలు, ఏఎన్ఎం గ్రేడ్-1కు మినహాయింపు ఇస్తున్నట్లు కలెక్టర్లకు సూచించింది.