పీఏసీ ఛైర్మన్ పదవికి వైసీపీ ఎమ్మెల్యే నామినేషన్!
ప్రజా పద్దుల కమిటీ (పీఏసీ) ఛైర్మన్ పదవికి నామినేషన్ వేయాలని వైసీపీ నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఛైర్మన్ పదవికి ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డితో నామినేషన్ వేయించాలని భావిస్తోంది. కాసేపట్లో ఆయన నామినేషన్ వేసే అవకాశముంది. పీఏసీలో సభ్యుడిగా ఎన్నిక కావాలన్నా 18 మంది ఎమ్మెల్యేల బలం ఉండాలి. ప్రస్తుతం వైసీపీకి 11 మంది ఎమ్మెల్యేలే ఉన్నారు. ఈ నేపథ్యంలో ఛైర్మన్ పదవికి నామినేషన్ వేయాలని వైసీపీ నిర్ణయించడంతో ఉత్కంఠ నెలకొంది.