ఏపీలోని ప్రతి మండల కేంద్రంలో జనరిక్ ఔషధ కేంద్రం ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలిపారు. 15 రోజుల్లో ఆయా షాపులకు లైసెన్సులు కూడా జారీ చేస్తామని చెప్పారు. గత ప్రభుత్వం జనరిక్ మందులపై ఫోకస్ పెట్టలేదని, తాము వాటిపై అవగాహన కల్పించేలా చర్యలు చేపట్టామని అన్నారు. దేశంలో 13,822 షాపులు ఉంటే ఏపీలో కేవలం 215 మాత్రమే ఉన్నాయన్నారు.