లారీ కింద పడిన మహిళ.. మానవత్వం చాటుకున్న కేంద్ర మంత్రి (వీడియో)
TG: కేంద్ర మంత్రి బండి సంజయ్ మానవత్వం చాటుకున్నారు. హుజురాబాద్ నియోజకవర్గం సింగాపూరం సమీపంలో ఓ యువతి రోడ్డు ప్రమాదానికి గురై లారీ కింద ఇరుక్కుపోయింది. ఆమె జడ టైర్ కింద ఇరుక్కుపోవడంతో బయటకు రాలేక ఇబ్బందిపడ్డారు. అటుగా వెళ్తేన్న కేంద్ర మంత్రి బండి సంజయ్ తన కాన్వాయ్ ని ఆపారు. పోలీసుల సాయంతో ఆమెను బయటకు తీయగా గాయాలపాలైన దివ్యశ్రీని తన కారులో ఆస్పత్రికి తరలించారు. ఆమెకు ప్రైవేటులో వైద్యం చేయించాలని, ఖర్చు తానే భరిస్తానని హామీ ఇచ్చారు.