హైకోర్టులో మోహన్‌బాబుకు ఊరట
నటుడు మోహన్ బాబుకు ఢిల్లీ హైకోర్టులో ఊరట లభించింది. ఆయన పేరు, ఫొటో, వాయిస్‌ను సోషల్ మీడియా ఖాతాలు, AI బాట్స్, వెబ్‌సైట్స్ వాడొద్దని సూచించింది. తన వ్యక్తిగత హక్కుల్ని రక్షించాలని కోరుతూ మోహన్ బాబు ఢిల్లీ హైకోర్టులో వేసిన పిటిషన్ విచారణ సందర్భంగా కోర్టు ఈ మేరకు వ్యాఖ్యానించింది. అనుమతి లేకుండా మోహన్ బాబుకు సంబంధించినవేవీ వాడరాదని, ఆయన కంటెంట్‌ను గూగుల్ తొలగించాలని స్పష్టం చేసింది.