ఉద్యోగాల బదిలీలపై మంత్రి పయ్యావుల కీలక ప్రకటన
తెలుగు రాష్ట్రాల మధ్య ఉద్యోగుల బదిలీలపై ఏపీ ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ కీలక ప్రకటన చేశారు. మంగళవారం అసెంబ్లీలో ఆయన మాట్లాడుతూ.. ‘ఉద్యోగుల బదిలీలపై తమ ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. తాజా నివేదిక ప్రకారం.. 1,942 మంది ఏపీ ఉద్యోగులు తెలంగాణ వెళ్లేందుకు ఆసక్తి చూపుతున్నారు. 1,447 మంది తెలంగాణకు చెందిన ఉద్యోగులు ఏపీకి రావాలనుకుంటున్నారు. తెలంగాణ ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపాం. అక్కడి నుంచి సమాధానం రావాల్సి ఉంది.’ అని అన్నారు.