ఢిల్లీలో ఘోర అగ్ని ప్రమాదం సంభవించింది. నగరకేంద్రంలోని కుతుబ్ విహార్‌లోని ఓ ఈ-రిక్షా గోదాములో భారీగా మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో వందలాది ఈ-రిక్షాలు దగ్ధమయ్యాయి. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది.. ఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపులోకి తెచ్చారు. ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.