విరాట్ కోహ్లీ కీలక నిర్ణయం
టీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ కీలక ప్రకటన చేశాడు. ప్రతిష్టాత్మక దేశవాళీ టోర్నీ బరిలో దిగబోతున్నట్లు తెలిపాడు. చివరగా 2012లో రంజీ మ్యాచ్ ఆడిన కోహ్లీ.. మళ్లీ 13 ఏళ్ల తర్వాత రంజీ ట్రోఫీ ఆడేందుకు సిద్ధమయ్యాడు. జనవరి 23 నుంచి ఢిల్లీ, సౌరాష్ట్ర మధ్య మ్యాచ్ జరగనుంది. అయితే ఈ మ్యాచ్‌కు మెడ నొప్పి కారణంగా కోహ్లీ అందుబాటులో ఉండట్లేదు. జనవరి 30 నుంచి రైల్వేస్‌తో జరగనున్న చివరి లీగ్ మ్యాచ్‌కు అందుబాటులో ఉండనున్నాడు.