మహా కుంభమేళాలో స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచిన మోనాలిసా భోస్లే బంపర్ ఆఫర్ కొట్టేశారు. ప్రముఖ బాలీవుడ్ డైరెక్టర్ సనోజ్ మిశ్రా తన సినిమాలో మోనాలిసాకు ఛాన్స్ ఆఫర్ ఇచ్చినట్లు సమాచారం. మోనాలిసా రూపం, ఆమె అమాయకత్వాన్ని చూసి ఫిదా అయ్యానని మిశ్రా తెలిపారు. డైరీ ఆఫ్ మణిపూర్ చిత్రంలో రైతు కూతురి పాత్రలో నటించేందుకు మోనాలిసా సరిగ్గా సెట్ అవుతుందని అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. త్వరలోనే ఆమెను కలుస్తానన్నారు.