రెండవ భద్రాద్రిగా పేరుగాంచిన నల్లగొండ రామగిరి సీతారామచంద్ర స్వామి దేవాలయం శ్రీరామనవమి సందర్భంగా దేవాలయ ప్రాంగణానికి విద్యుత్ కాంతులతో అలంకరణ చేశారు. ఈ సందర్భంగా సోమవారం ఈవో జయ రామయ్య మాట్లాడుతూ శ్రీరామనవమి కళ్యాణం భక్తుల రద్దీ దృశ అన్ని ఏర్పాట్లు చేసినట్లు ఎలాంటి అసౌకర్య కలగకుండా తగు చర్యలు తీసుకున్నామని తెలిపారు. మంగళవారం రోజు వేద బ్రాహ్మణుల మంత్రాల మధ్య ఎదుర్కోళ్ల కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు.