
నల్గొండ: మూడు రోజుల పాటు వర్షాలు.. ఎల్లో అలర్ట్ జారీ
ఉమ్మడి నల్గొండ జిల్లాల్లో మూడు రోజుల పాటు ఈదురుగాలులతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం మంగళవారం తెలిపింది. దీంతో ఎల్లో అలర్ట్ జారీ చేసింది. అటు అల్పపీడనం ప్రభావంతో ఉరుములతో కూడిన వర్షం పడేటప్పుడు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, చెట్ల కింద నిలబడవద్దని సూచించింది