
రాహుల్ గాంధీతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ
TG: సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటనలో భాగంగా ఆయన కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీతో భేటీ అయ్యారు. రాష్ట్రంలో జరుగుతున్న తాజా పరిస్థితుల, కులగణన, 42 శాతం బీసీ రిజర్వేషన్ల గురించి చర్చ జరుగుతోందని సమాచారం. మరో వైపు కార్పొరేషన్ పదవులు, ఎమ్మెల్యేల కోటా ఎమ్మెల్సీ పదవులతో పాటు మరికొన్ని కీలక అంశాలపై రాహుల్ గాంధీతో రేవంత్ చర్చిస్తున్నట్లు సంబంధిత పార్టీ వర్గాలు తెలిపాయి.